Pawan Kalyan -Rajamouli: సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాజమౌళి ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా పనిచేసి అనంతరం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అయితే మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాజమౌళి అనంతరం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇక ఈయన దర్శకత్వంలో సినిమా వచ్చింది అంటే ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో అందరికీ తెలిసిందే అందుకోసమే రాజమౌళితో సినిమా చేయడం కోసం ఎంతోమంది సెలెబ్రెటీలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రాజమౌళి లాంటి ఒక డైరెక్టర్ స్వయానా ఒక హీరో వద్దకు వెళ్లి సినిమా చేయమని అడగగా ఇంట్రెస్ట్ లేదని పంపించి ఒక సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నారు. నటుడు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉండగా పవన్ ఆసక్తి చూపకపోవడంతో ఈ సినిమా మరొక హీరోకి వెళ్లి హిట్ అందుకున్నారని తెలుస్తుంది మరి పవన్ రిజెక్ట్ చేసిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే ఆ సినిమా మరి ఏదో కాదు రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయంలో చేశారు.

విక్రమార్కుడు…
అయితే ఈ సినిమా కథతో రాజమౌళి ముందుగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లగా ఈ కథలో నటించడానికి ఆయన ఆసక్తి చూపించలేదు దాంతో రాజమౌళి రవితేజను కలిసి ఆయనతో ఈ సినిమా చేశారు. కట్ చేస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం రవితేజ కెరియర్ కు ఎంతగానో ఉపయోగపడిందని చెప్పాలి. ఇలా రాజమౌళి డైరెక్షన్లో సినిమా మిస్ చేసుకున్న పవన్ ఫ్యూచర్లో అయినా తనతో కలిసి నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.