• బీర్..యూత్ ఎక్కువగా ఇష్టపడే డ్రింక్
  • ప్రస్తుతం మనం వర్షకాలంలో బీర్లు తాగడం వల్ల అనర్థాలు
  • బీర్ తాగేవారికి దోమలు ఎక్కువగా కుడతాయని అధ్యయనం వెల్లడి

బీర్..యూత్ ఎక్కువగా ఇష్టపడే డ్రింక్. ఓ బంధువొచ్చినా..ఓ ఫ్రెండ్ కలిసినా..ఆనందంలో ఉన్నా..విషాదంలో ఉన్నా..ఇప్పుడు బీర్ తాగడం అనేది కామన్ అయిపోయింది. పండగలు, జాతరలు ఇలా సందర్భం ఏదైనా బీరు లేకుండా అవి జరగవంటారు యూత్.. అయితే బీర్ మితంగా తాగితే ప్రమాదం లేదంటున్నారు డాక్టర్లు.. అలా కాకుండా రోజూ బీర్ తాగుతుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మనం వర్షకాలంలో బీర్లు తాగడం వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం.

READ MORE: Kolkata doctor case: సుప్రీంకోర్టు విజ్ఞప్తికి స్పందించిన డాక్టర్లు.. సమ్మె విరమణ

అయితే బీరు తాగిన వారికి ఓ అలర్ట్ వచ్చింది. తమకు దోమలు ఎక్కువగా కుడుతుంటాయని చాలామంది చెబుతుంటారు. అయితే అందులో మద్యం తాగేవారికి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.
దీనికి గల కారణాలు జపాన్‌లో టొయామా యూనివర్శిటీ బయోడిఫెన్స్ మెడిసన్ విభాగం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం బీర్ తాగేవారికి దోమలు ఎక్కువగా కుడతాయని తేలింది. బీర్లు తాగడం వల్ల పెరిగిన శరీర ఉష్ణోగ్రతతో పాటు చెమట వారు విడుదల చేసే C02 దోమలను ఆకర్షిస్తాయని తేలింది. దీనిని బట్టి చూస్తే.. బీర్లు తాగే వారికి దోమలు బాగా కుడతాయి. ఇప్పుడు అసలే వర్షకాలం, రోగలు కూడా వ్యాపించే సమయం. మన పరిసరాల్లో దోమలు ఎక్కువగా తిరిగే సమయం.. దీంతో ఈ టైంలో మందుబాబులు కాస్త బీర్లకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో దోమలు కుట్టడం వల్లే.. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ అధ్యయనంతో అయినా వర్షాకాలంలో బీర్లకు దూరంగా ఉంటే మంచిది.