Nagachaitanya -Sobita: సినీ నటుడు నాగచైతన్య సమంతను ప్రేమించి 2017వ సంవత్సరంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు నిలబడలేదని చెప్పాలి. 2021 వ సంవత్సరంలో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా సమంత నాగచైతన్య విడిపోవడంతో నాగచైతన్య నటి శోభిత ప్రేమలో పడ్డారు.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఇటీవల వారి ప్రేమ విషయాన్ని తెలియజేస్తూ నిశ్చితార్థం చేసుకున్నారు ఇక ఈ నిశ్చితార్థం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నాగచైతన్య శోభిత పెళ్లికి కొద్ది నెలల గ్యాప్ ఉందనే విషయాన్ని నాగార్జున తెలియజేశారు.

ప్రస్తుతం వీరు కమిట్ అయిన సినిమాలన్నీ కూడా షూటింగ్ పూర్తి అయిన తర్వాతనే పెళ్లి జరుగుతుందని వచ్చే ఏడాది మార్చిలో వీరి వివాహం ఉండవచ్చని తెలుస్తోంది. అయితే వీరి పెళ్లి ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే విషయాల గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ కాబోతోందని తెలుస్తుంది.

ప్యారిస్ లో వివాహం..
ఇప్పటికే వెడ్డింగ్ కోసం ప్యారిస్ లో అందమైన లొకేషన్స్ కూడా సర్చ్ చేస్తున్నారని తెలుస్తోంది వీరి వివాహం పారిస్ లో కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో చాలా ఘనంగా జరగబోతుంది అని తెలుస్తుంది. ఇంకా ఈ రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారని సమాచారం.