ఈ వార్తను అనువదించండి:

TG స్థానిక సంస్థల ఎన్నికలు: తెలంగాణలో పంచాయతీ సహా స్థానిక ఎన్నికల సమరం మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే దీనిపై రేవంత్ సర్కార్ కసరత్తులు మొదలుపెట్టగా.. గ్రామాల్లోనూ ఎన్నికల హాడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల అంశం తెరమీదకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుల గణన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి పలుసార్లు ప్రకటించారు. దీంతో ఎన్నికలు దగ్గర పడటంతో రిజర్వేషన్‌ అమలుపై చర్చ విస్తృతంగా సాగుతోంది. బీసీ జనాభా ప్రతిపాదికన తమకు సీట్లు కేటాయించాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇచ్చిన హామీ మేరకు చట్టపరంగా ఉన్న 23 శాతంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపరంగా 19 శాతం సీట్లు కేటాయించి మొత్త 42 శాతం బీసీలకు ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం.

పూర్తిగా చదవండి..