Sonali Bendres: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన నటించిన ఇంద్ర సినిమాను తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం ఎక్కువ స్క్రీన్ లలో తిరిగి విడుదల కావడంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.. డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.

అప్పట్లోనే 55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించిన ఇంద్ర సినిమాని నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా తిరిగి విడుదలవుతున్న తరుణంలో ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సోనాలి బింద్రే సైతం సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా సోనాలి బింద్రే ఇంద్ర సినిమా విశేషాలను తెలియజేస్తూ.. చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయనతో కలిసి డాన్స్ చేయడం కోసం చాలా కష్టపడ్డానని తెలిపారు.. ముఖ్యంగా దాయి దాయి దామ్మా పాట షూటింగ్ రేపు జరుగుతుందని చెప్పడంతో నాకు చాలా కంగారు వచ్చిందని ఆ భయంతో రాత్రి నిద్ర పోలేదని తెలిపారు.

డాన్స్ వేయడం కోసం భయపడ్డాను..
ఆ పాటలో చిరంజీవి గారు ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు డాన్స్ విషయంలో ఆయనని బీట్ చేసే వాళ్ళు లేరని తెలిపారు. ఇక ఈ పాటలో వీణ స్టెప్ నన్ను ఎక్కడ చేయమంటారో అని చాలా కంగారు పడ్డానని ఇలాంటి ఒక సినిమాను తిరిగి బిగ్ స్క్రీన్ పై చూడటం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈమె ఇంద్ర విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.