జోగి రాజీవ్: అగ్రిగోల్డ్ భూమల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ కొడుకు జోగి రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో ఆగస్టు 13న జోగి రాజీవ్‌‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన A2గా ఉన్నారు. సీఐడీ జప్తులో ఉన్న అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను జోగి రాజీవ్‌ కొనుగోలు చేసి ఇతరులకు అమ్మినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

The post Breaking: మాజీ మంత్రికి బిగ్ రిలీఫ్.. కొడుక్కు బెయిల్..! appeared first on Rtvlive.com.