ఈ వార్తను అనువదించండి:

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఆయన అధికారులతో కలిసి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ” స్కిల్ సెన్సస్‌లో భాగంగా యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్, స్కిల్స్‌ను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తుంది. ఈ ప్రొఫెల్స్‌ను ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తాం. తద్వారా ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకొస్తాం. ఎడ్యుకేషన్, స్కిల్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాలి. ఇదే సమయంలో యువత, ప్రజలను అపోహలకు గురిచేసే అనవసరమైన ప్రశ్నలు అడగొద్దు.

పూర్తిగా చదవండి..