Sobhita: నటి శోభిత ధూళిపాళ్ల అక్కినేని నాగచైతన్యతో ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె నాగచైతన్య ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు.

ఈ విధంగా శోభిత నాగచైతన్య నిశ్చితార్థపు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక వీరి పెళ్లికూడా వచ్చేయడాది జరగబోతుందని వీరి పెళ్లికి పారిస్ వేదిక కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా శోభిత పెళ్లి కాకుండానే అక్కినేని ఇంటి పరువు తీస్తోందంటూ అక్కినేని అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈమె ఏం చేసింది అనే విషయానికి వస్తే వరుస సినిమాలలో నటిస్తున్న శోభిత ఓ ఐటమ్ సాంగులో చేయటానికి కూడా సిద్ధమైనదని సమాచారం.

బాలీవుడ్ సినిమా డాన్ 3 చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు అయితే ఇందులో ఓ స్పెషల్ సాంగ్ చేయడం కోసం డైరెక్టర్ శోభితను సంప్రదించినట్టు తెలుస్తుంది. మరి ఈమె ఈ పాట చేయడానికి ఒప్పుకుందా లేదా అనే విషయం తెలియకపోయినా అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చైతూ ఒప్పుకున్నాడా…
ఇక ఈమె ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి నాగచైతన్య ఒప్పుకుంటారా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ఈమె కనుక ఈ స్పెషల్ సాంగ్ చేస్తే అక్కినేని పరువు గంగలో కలిసిపోయినట్టేనని మరికొందరు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. విడాకులు ఇచ్చిన తర్వాత సమంత స్పెషల్ సాంగ్ చేసిన అక్కినేని ఫ్యాన్స్ ట్రోల్ చేశారు మరి అలాంటిది పెళ్లి కాకుండానే శోభిత స్పెషల్ సాంగ్ చేయటాన్ని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాల్సి ఉంది.