• షూటింగ్ లో రవితేజకు గాయం
  • యశోదాలో రవితేజకు శస్త్రచికిత్స
  • సంక్రాంతికి వచ్చేస్తున్న మాస్ మహారాజ్

మాస్ మహారాజ రవితేజ ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించారు. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ విడుదల అయింది. ఒక వైపు ఈ సినిమా థియేటర్లో ఉండగానే కెరీర్ లో RT75 సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ లో రవితేజ గాయపడ్డారు. RT75వ షూటింగ్ లో రవితేజ కుడిచేతికి గాయం అయినా కూడా ఆయన షూటింగ్ ను కంటిన్యూ చేయడంతో గాయం తీవ్రత ఎక్కువ కావడంతో యశోద ఆస్పత్రికి తరలించారు. గాయం కాస్త లోతుగా తగలడంతో వైద్యులు రవితేజ  గాయానికి శస్త్రచికిత్స చేశారు.  ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యుల సూచించారట.

Also Read: Chiru – NBK: ఒకే ఫ్రేములో సందడి చేసిన చిరు, బాలయ్య.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

దీంతో రవితేజ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కాగా రవితేజ తన వ్యక్తిగత ‘ X ‘ ఖాతాలో ఓ పోస్టు చేశారు. సాఫీగా సాగిన సర్జరీ తర్వాత విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యాను. ఈ మేరకు తనను ఆశీర్వదించిన వారికి, తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా మళ్లీ సెట్స్ పైకి వెళ్లేందుకు ఎగ్జైటింగ్ గా ఉన్న అని చెప్పారు. మాస్ మహారాజ చేసిన ఈ పోస్టుతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఆయన అభిమానులు. అతిత్వరలో రవితేజ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొండనిఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరెకెక్కుతున్న రవితేజ 75వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేస్తామని ఇది వరకే ప్రకటించారు మేకర్స్.