Bhagavanth Kesari: నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో శ్రీ లీల బాలకృష్ణకు కూతురు పాత్రలో నటించారు అలాగే కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించినది.

ఇలా ఈ సినిమా ద్వారా బాలకృష్ణ మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న తరుణంలో మరోసారి ఈ సినిమా ప్రస్తావన రావడానికి కారణం లేకపోలేదు. తాజాగా ఈ సినిమా ఐఫా అవార్డులలో సత్తా చాటిందని తెలుస్తోంది.

ప్రతి ఏడాది నటీనటులకు ఈ అవార్డులను అందిస్తారు. ఈ క్రమంలోనే ఐఫా(IIFA) అవార్డ్స్ నామినేషన్స్ లో బాలయ్య భగవంత్ కేసరి 4 కేటగిరిస్ లో నానినేషన్స్ లో నిలిచింది. బెస్ట్ సినిమా, బెస్ట్ ఫర్ఫామెన్స్ లీడింగ్ రోల్ (మేల్), బెస్ట్ డైరక్టర్, బెస్ట్ పర్ఫామెన్స్ లీడింగ్ రోల్ (ఫీమేల్) విభాగాలలో ఈ సినిమా నామినేషన్ లోకి వచ్చింది దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐఫా నామినేషన్..
త్వరలోనే ప్రకటించబోయే ఈ అవార్డులలో భాగంగా భగవంత్ కేసరి సినిమాకు నామినేషన్స్ లో భాగంగా ఎన్ని అవార్డులు వస్తాయోనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఐఫా నామినేషన్ లో నిలవడంతో అభిమానులు అలాగే చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.