ఈ వార్తను అనువదించండి:

జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని సొంతం చేసుకోవాలని మోదీ సర్కార్‌ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌లో గతంలో పనిచేసిన ఇద్దరు బీజేపీ నేతలను అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరు నేతలు ‘మిషన్ కశ్మీర్‌’ ను నడిపించనున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

పూర్తిగా చదవండి..