ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ: జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బృహత్తర బాధ్యతలా చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని, లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. ఆదివారం హరేకృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న రేవంత్.. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు. భగవద్గీత స్పూర్తిగా శ్రీకృష్ణుడే మార్గదర్శిగా చెరువుల పరిరక్షణను ధర్మ రక్షణగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

పూర్తిగా చదవండి..