ఈ వార్తను అనువదించండి:

నాగార్జున సాగర్: నారగార్జున సాగర్ కు వరద పోటెత్తింది. వరద ప్రవాహంతో నిండుకుండలా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మారింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ఉధృతి ఇలానే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 64 వేల 699 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 64 వేల 699 క్యూసెక్కులు వద్ద కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు వద్ద ఉంది.

పూర్తిగా చదవండి..