Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు మెగా కుటుంబ సభ్యులతో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్దతు తెలుపుతూ ఆయన విజయానికి కారణమయ్యారు. కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కే కాకుండా వైకాపా నాయకుడు తన స్నేహితుడికి మద్దతు తెలిపారు. దీంతో ఇరువురి మధ్య తారాస్థాయికి విభేదాలు చేరుకున్నాయి.

ఇలా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు రావడంతో మెగా అభిమానులు సైతం అల్లు అర్జున్ పట్ల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక చిరంజీవి లేకపోతే అల్లుఅర్జున్ అనే వ్యక్తి లేడు అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు అసలు అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే చిరంజీవి ఎక్కడో ఉండేవారు అంటూ కూడా ఘాటుగానే తిరిగి సమాధానం ఇస్తున్నారు.

ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య రోజు రోజుకు తారా స్థాయిలో వివాదాలు ముదిరిపోతున్న తరుణంలోనే అల్లు అర్జున్ అభిమానులు గతంలో పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు ఇంత మంచి జీవితాన్ని కల్పించిన వారిలో ముఖ్యంగా తన తల్లిదండ్రులు కీలకపాత్ర పోషించారని అలాగే తన అన్నయ్య కూడా కారణమని తెలిపారు.

అల్లు అరవింద్ గారు అవకాశం ఇచ్చారు..
వీరి తర్వాత అల్లు అరవింద్ గారు వల్లే తన జీవితం ఇలా ఉందని తెలిపారు. ఆయన రెండు సినిమాలలో నాకు అవకాశం కల్పించారు అంటూ అల్లు అరవింద్ గురించి గొప్పగా మాట్లాడుతున్న వీడియోని వైరల్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పై మెగా ఫాన్స్ రియాక్షన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.