Keerthy Suresh: కీర్తి సురేష్ పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగడమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. మలయాళం చిత్ర నిర్మాత సురేష్ సీనియర్ నటి మేనక కుమార్తె కీర్తి సురేష్. ఇక ఈమె బాల నటిగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

2013లో గీతాంజలి అని మలయాళం మూవీతో హీరోయిన్ గా మారింది. నేను శైలజ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి క్రేజీ సొంతం చేసుకున్న ఈమె అనంతరం తెలుగు తమిళ భాష చిత్రాలలో సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకున్నారు.

ఇక ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాలో నటిస్తూ సుమారు 5 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇలా ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న కీర్తి సురేష్ మొదటి సంపాదన ఎంత ఈమె హీరోయిన్ కాకముందు ఎక్కడైనా పని చేశారా అనే విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

బట్టలు సరిచేస్తూ…
ఈమె హీరోయిన్ కాకముందు కొద్ది రోజులు ఫ్యాషన్ షోస్ లో మోడల్స్ కు బట్టలు సరి చేసే పని చేసేదట. ఇలా వారి బట్టలు సరి చేస్తూ ఉన్నందుకు ఈమె 500 రూపాయల జీతం అందుకునేవారు. ఇదే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటూ కీర్తి సురేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.