Star Hero: సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయంలో తన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఏమాత్రం లేదు. కానీ ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు హీరోగా, ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ 550 కోట్లకు పైగా ఆస్తులకు అధిపతిగా నిలిచారు. మరి ఈ స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ అయినటువంటి ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు జాన్ అబ్రహం.

ఈయన సినిమాల ద్వారా మాత్రమే కాకుండా కాంట్రవర్సీల ద్వారా కూడా ఎంతో ఫేమస్ అయ్యారు. సినిమా హిట్ అయిన తనకు సంబంధం లేకుండా ఏడాదికి మూడు నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఈయన వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కోవడంతో సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి. ఇక ఇటీవల జాన్ అబ్రహం నటించిన వేద్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఇది కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన జీవితం గురించి పలు విషయాలు తెలిపారు. తనది మధ్యతరగతి కుటుంబమని ఇప్పటికీ కూడా తను అలాగే జీవించడానికి ఇష్టపడతానని తెలిపారు. ఇక నేను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తన బ్యాంకు బ్యాలెన్స్ కేవలం 550 రూపాయలు మాత్రమే ఉందని ఈ డబ్బుతోనే తన కెరియర్ ప్రారంభమైందని తెలిపారు..

కోట్లు విలువ చేస్తే బంగ్లాలు…
2003 వ సంవత్సరంలో నా నెల జీతం 4800 అని తెలిపారు. ఒకప్పుడు బ్యాంకు బ్యాలెన్స్ లేని ఈ హీరో ఇప్పుడు 550 కోట్లకు అధిపతి మాత్రమే కాకుండా లగ్జరీ కార్లు ఖరీదైన బంగ్లాలలో నివసిస్తున్నారు. ఈయనకు ముంబైలో ఉన్నటువంటి బంగ్లా సుమారు 70 కోట్ల వరకు విలువ చేస్తుందని సమాచారం.