ఈ వార్తను అనువదించండి:

హైడ్రా కమిషనర్ రంగనాథ్: హైడ్రా.. ఈ పేరు వింటే ఆక్రమణల అక్రమాలతో ఆస్తులు పెంచుకున్న బడా బాబులకు నిద్ర పట్టడం లేదు ఇప్పుడు. ఎప్పుడు ఎవరివైపు హైడ్రా బుల్ డోజర్ వస్తుందో అనే టెన్షన్ తో ఉన్నారు. కొందరైతే ముందుగానే భుజాలు తడుముకుంటూ తమది పట్టా భూమి అనీ.. చెరువులు ఆక్రమించలేదనీ.. తమకు చెందిన స్థలంలోనే కట్టడాలు చేశామని ఇలా రకరకాలుగా మీడియా ముందుకు వచ్చి చెప్పేసుకుంటున్నారు. ఒకవిధంగా చూస్తే చాలామంది తమ ఆస్తుల వివరాలు నేరుగా వివరించేస్తున్నారు. ఇది డబ్బున్న వాళ్లు.. సెలబ్రిటీలు చేస్తున్న హంగామా. అయితే, మరోవైపు మధ్యతరగతి ప్రజలు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ బ్యాంకు లోన్లతో అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ లేదా ఇళ్లను కొనుక్కున్న వారికీ కూడా భయం ఆవరించింది. తమ అపార్ట్మెంట్ లకు అన్నిరకాల పర్మిషన్లు ఉన్నాయని బిల్డర్లు చెప్పడం.. సంబంధిత డాక్యుమెంట్స్ చూపించడం.. రిజిస్ట్రేషన్ కూడా పక్కా కావడంతో తాము ఇళ్లను కొనుక్కున్నామనీ.. ఇప్పుడు చెరువులు.. బఫర్ జోన్ లు (Buffer Zone) అంటూ ఇళ్లను కూల్చేస్తుంటే.. రేపు మా ఇల్లు కూడా కూల్చేస్తే మా పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. నాగార్జున (Nagarjuna) లాంటి సెలబ్రిటీనే వదిలిపెట్టని హైడ్రా తమ ఇళ్ల మీదకు వస్తే తమకు కలిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఉన్నాయనే ఇల్లు కొనుకున్నాం. ఇప్పుడు ఎదో రూల్స్ చెబితే ఎలా అని వాపోతున్నారు. ఇల్లు అనేది సామాన్యుడి కల. దాదాపుగా అందరూ అప్పులు చేస్తి మరీ  ఇల్లు కొనుక్కుంటారు. ఇప్పుడు హైడ్రా నిబంధనల పరిధిలోకి తమ ఇల్లు లేదా ఫ్లాట్ వస్తే ఏం చేయాలనేది వారి ఆవేదన.

పూర్తిగా చదవండి..