Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి త్రిష ఒకరు. ఈమె ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు. ఇక కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న త్రిష ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మరోసారి స్టార్ హీరోల సరసన నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న త్రిష ఇప్పటివరకు తన కెరియర్లో చేయని పని ఒక హీరో కోసం చేయబోతున్నారని తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు త్రిషతో పాటుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతోమంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు కానీ ఈమె మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పెషల్ సాంగ్స్ చేయలేదు.

తాజాగా విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న గోట్ చిత్రానికి గాను ఈమె విజయ్ సరసన స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని అయితే ఈ విషయాన్ని ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదని, త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తూ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

స్పెషల్ సాంగ్ లో త్రిష..
ఈ విధంగా విజయ్ దళపతి కోసం త్రిష ఇప్పటివరకు చేయని విధంగా మొదటి సారి స్పెషల్ సాంగ్ చేయబోతున్నారనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున ఈ వార్తలు వైరల్ అవ్వడమే కాకుండా హీరో విజయ్ పట్ల త్రిషకు అంత ఇంట్రెస్ట్ ఏంటి అంటూ పలు సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా త్రిష స్పెషల్ సాంగ్ చేయబోతున్నారనే విషయం అభిమానులకు షాకింగ్ అని చెప్పాలి.