• నటి కంగనా రనౌత్‌ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా నిర్మాతలకు శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జిపిసి) లీగల్ నోటీసు పంపింది.
  • సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి విడుదల చేసిన ట్రైలర్‌ను తొలగించాలని
  • అలాగే సిక్కు సమాజానికి వ్రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని కోరారు.

Kangana Ranaut: ఎంపీ, నటి కంగనా రనౌత్‌ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా నిర్మాతలకు శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జిపిసి) మంగళవారం లీగల్ నోటీసు పంపింది. శిరోమణి కమిటీ న్యాయ సలహాదారు అమన్‌బీర్ సింగ్ సియాలీ పంపిన నోటీసులో.. కంగనా రనౌత్‌ తో సహా చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి విడుదల చేసిన ట్రైలర్‌ను తొలగించాలని, అలాగే సిక్కు సమాజానికి వ్రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ సందర్బంగా.. శిరోమణి కమిటీ సెక్రటరీ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. సినిమాను ఆపాలని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషికి పలుమార్లు లేఖలు రాశామని ఆయన తెలిపారు. శిరోమణి కమిటీ ఛైర్మన్‌ అడ్వకేట్‌ హర్జిందర్‌ సింగ్‌ ధామి సూచనల మేరకు కంగనా రనౌత్‌తో సహా ఈ చిత్ర నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంపారు.

Nadiminti Narasinga Rao: టాలీవుడ్లో విషాదం.. స్టార్ రైటర్ కన్నుమూత

ఎమర్జెన్సీ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత అనేక సిక్కు వ్యతిరేక సన్నివేశాలు వెలుగులోకి వచ్చాయని, ఇది సిక్కుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆయన అన్నారు. సినిమాలో సిక్కులను తీవ్రవాదులుగా, వేర్పాటువాదులుగా చూపించే ప్రయత్నం చేశారని ఇది ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సిక్కు సమాజంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని శిరోమణి కమిటీ చట్టపరమైన చర్యలను ప్రారంభించిందని ప్రతాప్ సింగ్ తెలిపారు. అభ్యంతరకరమైన సిక్కు వ్యతిరేక సన్నివేశాలను కంగనా రనౌత్ అలాగే చిత్ర నిర్మాతలు కత్తిరించకపోతే వారిపై అన్ని స్థాయిలలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.