• వేణు స్వామికి నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్
  • హైకోర్టును ఆశ్రయించిన వేణుస్వామి
  • మహిళా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం
  • నాగచైతన్య శోభితలకు లేని సమస్య మీకెందుకు? అని ప్రశ్న

వేణు స్వామికి నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వేణు స్వామిపై మహిళా కమిషన్ కు ఓ ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు జారీ చేయగా.. దానిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్డును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నాగచైతన్య శోభితలకు లేని సమస్య మీకెందుకంటూ ఫిలిం జర్నలిస్టులను ప్రశ్నించింది. మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ కోర్టు తీర్పు వెలువరించింది.

READ MORE: INS Arighat: ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి రేపు ప్రారంభం..

కాగా.. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా పలువురు సినీ రాజకీయ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెప్పి ఫేమస్ అయిన స్వామి మీద ఇటీవల ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది గంటల్లోనే వాళ్లు 2027 వరకే కలిసి ఉంటారని తర్వాత విడిపోతారని అంటూ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేశారు.ఈ కామెంట్ల మీద తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో పాటు దాని అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరేళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశాయి. గతంలో కూడా ఆయన సినిమా రిలీజ్ ల గురించి, రాజకీయ ఫలితాల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి అవాస పాలైన బుద్ధి రాలేదని ఇప్పుడు నాగచైతన్య శోభిత వ్యక్తిగత వ్యవహారాలను రోడ్డుకి ఈడుస్తూ చేసిన వీడియో గురించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ అంశం మీద వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టులో వేణుస్వామి సవాల్ చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు తీర్పు వెలువరించింది.