ఈ వార్తను అనువదించండి:

నాదెండ్ల మనోహర్: ‘కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకిత భావంతో పని చేస్తుంది. రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తుంద’ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందుల తయారీదార్లు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యూరియా, డి.ఏ.పి., ఎరువులు, పురుగు మందుల అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కొలతలు, ధరల్లో తేడాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బరువు, ఎమ్మార్పీల్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జనవరి నుంచి అమల్లోకి వచ్చిన యూనిట్ సేల్ ప్రైస్ నిబంధనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పూర్తిగా చదవండి..