Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్నారు కేవలం ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపకపోవడం వల్లే మెగా అభిమానులతో పాటు మెగా హీరోలు అలాగే జనసేన ఎమ్మెల్యేలు కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ వచ్చారు.. ఇప్పటివరకు మెగా హీరోలు అల్లు అర్జున్ గురించి పరోక్షంగా మాట్లాడారు.

ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు కూడా మీడియా సమావేశంలో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బొల్లి శెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఒక పుడింగిలా మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు చేశారు. అల్లు అర్జున్ తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.

తాజాగా మరొక ఎమ్మెల్యే చలమ శెట్టి రమేష్ అనే వ్యక్తి అల్లు అర్జున్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ మెగా కుటుంబం కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయనకు ఎలాంటి సంస్కారం లేదని చిరంజీవి గారు ఎంతో ఆదర్శప్రాయుడని తెలిపారు.. అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలను వెనుక్కు తీసుకోవాలని తెలిపారు..

కాళ్లు కడిగి నీళ్లు చల్లుకోవాలి..

అల్లు అర్జున్ మెగా హీరోల గురించి మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ కాళ్లకు నమస్కారం చేసి వారి కాళ్ళను కడిగి ఆ నీటిని తలపై చల్లుకోవాలి లేదంటే మా నియోజకవర్గంలో పుష్ప 2 సినిమాని అడ్డుకుంటామంటూ ఈ సందర్భంగా రమేష్ చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.