NTR: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం ఈయన గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు..

ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే కమిట్ అవుతూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. త్వరలోనే దేవర సినిమా ద్వారా ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఎన్టీఆర్ నటన గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పలు సందర్భాలలో వెల్లడించారు.

ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు మాత్రమే కాకుండా ఎంతో వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఇక ఏదైనా సినిమా ఈవెంట్ జరిగింది అంటే ఎప్పుడు కూడా అభిమానులకు ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటూ వారి క్షేమాన్ని కోరుకుంటారు. తారక్ ఇంట్లో ఎంతో మంది రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఏ కుటుంబం కూడా అలా బాధపడకూడదని అభిమానులకు ఈయన జాగ్రత్తగా చెబుతూ ఉంటారు.

ఇకపోతే ఎన్టీఆర్ నటించిన బాద్ షా సినిమా వేడుకకు పెద్ద ఎత్తున అభిమానులు తరలించారు. అయితే అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో భాగంగా రాజు అనే అభిమాని మృతి చెందారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ కుటుంబాన్ని కలిసి ఆ కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చారు.

పెద్దకొడుకుగా..
ఈ ఘటన జరిగి 11 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఆ కుటుంబ బరువు బాధ్యతలను ఎన్టీఆర్ తీసుకోవడమే కాకుండా ఆ కుటుంబంలో పెద్దకొడుకుగా వారికి అండగా నిలిచారు. ఇక ఆ అభిమాని మరణించిన సమయంలో నిర్మాత బండ్ల గణేష్ 5 లక్షలు వరకు డబ్బులు అందజేశారు. ఇలా 11 సంవత్సరాల అయినా అభిమాని పట్ల ఎన్టీఆర్ చూపించే ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు.