ఈ వార్తను అనువదించండి:

వైసీపీ పార్టీ క్యాంపు రాజకీయాలు: వైసీపీ పార్టీ కష్టాలను ఎదుర్కోంటోంది. అధికారం లేని చోట ఉండడం కంటే అధికార పార్టీలో చేరిపోవడం బెటర్‌‌ అని ఆపార్టీ నేతలు వెళ్ళిపోతున్నారు. కార్పొరేటర్లు మొదలుకొని ఎంపీల వరకు ఇదే చేస్తున్నారు. ఇందులో టీడీపీ పాత్ర కూడా చాలా బలంగానే ఉంది. వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకోవడంలో విజయం సాధించింది. ఇప్పుడు తాజాగా 11మంది ఎంపీల్లో పది మంది కూటమి పార్టీల్లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారని సమాచార. వీరిలో టీడీపీలోకి ముగ్గురు, బీజేపీలోకి ఐదుగురు, జ‌నసేన పార్టీలోకి ఇద్ద‌రు వెళ్ల‌బోతున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. ఎంపీలు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్ రావులు రాజీనామా చేశారు. వీరిద్దరూ త్వ‌ర‌లో తెలుగుదేశం గూటికి చేర‌బోతున్నారని తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ర‌ఘునాథ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ప‌రిమ‌ళ్ న‌త్వాని సిద్ధ‌మ‌వుతున్నారు‌. ఇక పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ఆర్‌. కృష్ణ‌య్య‌లు జ‌న‌సేన పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అలాగే విజ‌య‌సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల‌లో ఒక‌రు బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్.

పూర్తిగా చదవండి..