Nani: నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం సరిపోదా శనివారం. డి వివి దానయ్య నిర్మాణంలో నాని, ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్లుగా ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు ఉండడంతో ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిందనే తెలుస్తోంది.

ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఎంత మేర కలెక్షన్స్ రాబట్టిందనే విషయానికి వస్తే..నాని కెరీర్లో అత్యధికంగా దసరా సినిమా మొదటి రోజు 38 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిపోదా శనివారం సినిమా దసరా సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్ట లేకపోయిందని తెలుస్తుంది.

ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ గురించి డివివి నిర్మాణ సంస్థ వారు అధికారకంగా ఎక్కడ ప్రకటించకపోయిన కొన్ని ట్రేడ్ వర్గాల వారు మాత్రం ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలు వేసి కలెక్షన్ల వివరాలను బయటపెడుతున్నారు. ఇలా ట్రేడ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం సరిపోదా శనివారం సినిమా మొదటి రోజులో భాగంగా 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబడినట్టు తెలుస్తుంది.

20 కోట్లు…
ఇండియాలోని మిగిలిన ప్రాంతాల్లో 4 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు పోటీగా ఎలాంటి పెద్ద సినిమాలు విడుదల కాలేదు అలాగే వీక్ ఎండ్ కూడా కావటంతో ఈ రెండు మూడు రోజులలో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. మరి ఈ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడుతుందా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది అయితే ఇటీవల ఈయన నటించిన దసరా 110 కోట్లు గ్రాస్, హాయ్ నాన్న 75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి ఈ కలెక్షన్స్ సరిపోదా శనివారం క్రాస్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.