గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమెరాలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు అత్యంత తీవ్రమైనవన్నారు. విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసే ఘటన ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండని.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకోకడంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు.

ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారని ధ్వజమెత్తారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా.. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది.  విద్యాసంస్థలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. ఈ మేరకు జగన్ తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేశారు.

The post లోకేష్ ను కాపాడడం కోసమే.. గుడ్లవల్లేరు ఘటనపై జగన్ సంచలన కామెంట్స్! appeared first on Rtvlive.com.