Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే కంటెస్టెంట్ లకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారనేది మరి ఒక రోజులో తెలియనుంది.

ఇక ఈ కార్యక్రమాల్లో భాగంగా కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియతో పాటు వారికి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అనే విషయానికి సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే వారికి తక్కువలో తక్కువ రోజుకు 15 వేల వరకు రెమ్యూనరేషన్ అందిస్తారు. ఇది యూట్యూబర్స్ అలాగే పెద్దగా పాపులారిటీ లేని కంటెస్టెంట్లకు రోజుకు 15 నుంచి 20వేల వరకు రెమ్యూనరేషన్ ఇస్తారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ అంటే రోజుకు 40 వేల రూపాయలు.

అధికారికంగా వెల్లడించలేదు..
ఇకపోతే ఎంతో మంచి క్రేజ్ ఉన్న కంటెస్టెంట్లు కనుక హౌస్ లోకి వెళితే వారికి 50వేల వరకు అందిస్తారు ఇక కొంత మొత్తంలో పాపులారిటీ ఉన్నవారికి 25 నుంచి 30 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇస్తారు. ఇక ఈ కంటెస్టెంట్ హౌస్ లో ఉంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మంచి కంటెంట్ ఉంటుందన్న వారికి 35 నుంచి 40 వేల వరకు రెమ్యూనరేషన్ ఇస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ రెమ్యూనరేషన్ కి సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా ఎవరు అధికారకంగా వెల్లడించలేదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.