Nani: సినీ ఇండస్ట్రీలో టైర్ 2 హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు నాచురల్ స్టార్ నాని ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన అనంతరం హీరోగా అవకాశాలు అందుకున్నారు. ఇలా హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన నాని ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేస్తున్నారు.

ఇక నాని నటిస్తున్న సినిమాలన్నీ ఇటీవల పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తరుణంలో ఈయన సినిమాలకు భారీ స్థాయిలో మార్కెట్ పెరిగింది. తద్వారా ఈయన కూడా రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. కరోనా సమయంలో ఒక సినిమాకు సుమారు 15 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న నాని ఇప్పుడు పాతిక కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

కరోనా సమయంలో ఈయన మార్కెట్ 40 కోట్ల రూపాయల వరకు ఉండేది కానీ ఇప్పుడు 60 కోట్లకు చేరడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచారనే చెప్పాలి. ఇక ఇటీవల నాని నటించిన సరిపోదా శనివారం సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని కలెక్షన్స్ కూడా రాబడుతుంది. దీంతో ఈయన తదుపరి సినిమాకు రెమ్యూనరేషన్ పెంచే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

పాతిక కోట్లు..
ఇలా మూడు సంవత్సరాలకే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచారని ఇప్పుడు మరోసారి రెమ్యునరేషన్ పెంచబోతున్నట్టు తెలుస్తుంది. ఈసారి ఈయన మరో ఐదు కోట్లన్ని పెంచి 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఆశ్చర్య పోవాల్సిన పనిలేదంటూ పలువురు ఈయన రెమ్యూనరేషన్ పట్ల కామెంట్లు చేస్తున్నారు.