Kirak RP: బిగ్ బాస్ కార్యక్రమం మరొక రోజులో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించిన పేర్లు బయటకు వచ్చాయి. కానీ చివరిలో కంటెస్టెంట్లు పూర్తిగా మారిపోయారని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే వారికి సంబంధించిన లిస్టు వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈ కార్యక్రమంలో జబర్దస్త్ మాజీ కమెడియన్ కిరాక్ ఆర్పీ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ మొదటి నుంచి కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో ఈయన పెద్ద ఎత్తున రాజకీయాల గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇలాంటి తరుణంలో ఈయనని కనుక బిగ్ బాస్ హౌస్ లోకి పంపితే మంచి కంటెంట్ ఉంటుందన్న ఆలోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు తనని కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపించబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై కిరాక్ ఆర్పి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చింది.

ప్రతిసారి ఫోన్ కాల్ వస్తుంది..
ఈసారి మాత్రమే కాదు ప్రతిసారి నాకు ఫోన్ కాల్ వస్తుంది కానీ నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని నేను బిగ్ బాస్ లోకి వెళ్తున్నాను అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో కిరాక్ ఆర్పీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.