Poonam Kaur: ఇటీవల ఏపీలో గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ బాత్రూంలో కెమెరాలు పెట్టడంతో 300 మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయంటూ ఓ ఘటన సంచలనగా మారింది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జనసేన పార్టీకి చెందిన ఓ వ్యక్తి రహస్యంగా బాత్రూంలో కెమెరాలను పెట్టడం వల్ల 300 మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయని ఆరోపణలు చేస్తున్నారు.

ఇకపోతే ఈ ఘటనపై హోంశాఖ స్పందించారు ఇప్పటికే హాస్టల్ ను పరిశీలించిన పోలీస్ అధికారులు అక్కడ ఎలాంటి పరికరాలు దొరకలేదు అంటూ సమాధానం చెప్పారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఇక ఈ ఘటనపై కొంతమంది అమ్మాయిలు ఎంతో ఎమోషనల్ అవుతూ తమ వీడియోలన్నీ బయట అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక మరి కొంతమంది ఈ ఘటన తమని ఎంతగానో మానసికంగా కృంగదీస్తోందని, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయి అంటూ కొన్ని వీడియోలు బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసినదే .ప్రస్తుతం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉధృత నెలకొంది ఇలాంటి తరుణంలోనే నటి పూనమ్ కౌర్ ఈ ఘటన పై స్పందించారు.

ఆంధ్రాలో ఏం జరుగుతోంది..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోల మీద పూనమ్ కౌర్ స్పందించింది. 28 కెమెరాలు, 300 వీడియోలు.. అసలు ఆంధ్రాలో ఏం జరుగుతోందో చూడండి అంటూ బర్కాదత్‌కు ట్యాగ్ చేసింది. ఇక అంతకు ముందు ఈ ఘటన గురించి చెబుతూ వైఎస్ షర్మిళను ట్యాగ్ చేసింది. ఇలా ఈ హిడెన్ కెమెరా ఘటన, గర్ల్స్ హాస్టల్ ఘటన మీద పూనమ్ కౌర్ మాత్రం గట్టిగా స్పందిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో నిజా నిజాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.