Bigg Boss 8: బిగ్ బాస్ అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. ఇక ఈ కార్యక్రమం తెలుగులో కూడా 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8వ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో వార్తలు బయటకు వస్తున్నాయి.

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్లకు అదే ఒక ప్రపంచమని చెప్పాలి. అక్కడే వారు ప్రేమగా ఉన్న, పోట్లాడుకున్న వారి ఎమోషన్స్ బయట పెట్టాలనుకున్న ఆ హౌస్ లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. అయితే ఈ హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్ ప్రతి ఒక్క కదలికను కూడా అక్కడున్న కెమెరాలు రికార్డు చేస్తూ ఉంటాయి. ఇక కంటెస్టెంట్ కదలికలను బట్టి కెమెరాలు కూడా తమ మూమెంట్ మార్చుకుంటాయి.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఇలా ప్రతి ఒక్క కదలికను క్యాప్చర్ చేయడం కోసం అక్కడ ఎన్ని కెమెరాలని పెట్టి ఉంటారు అసలు కెమెరాలు లేని చోటు ఏది అని చాలామందికి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అయితే బిగ్ బాస్ హౌస్ అన్ని సౌకర్యాలతో కలిపి ఏకంగా 10 వేల స్క్వెర్ ఫీట్ వైశాల్యంలో ఏర్పాటు చేస్తారు. ఈ హౌస్ లో మొత్తం 60 కెమెరాలు ఉంటాయట. వాటిని నిత్యం మానటరింగ్ చేయడానికి పీసీఆర్ నుంచి షిఫ్ట్ వైజ్ గా ఎంప్లైయిస్ పనిచేస్తుంటారు.

హౌస్ లో ఎప్పుడు ఏం జరిగినా స్పందించే విధంగా కెమెరాల ద్వారా చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో జరిగే ఈవెంట్స్ కాని, గేమ్స్ కాని.. ఎమోషనల్ మూమెంట్స్ ఏమున్నా సరే కెమెరా వెంటనే క్యాప్చర్ చేస్తుంటుంది. కంటెస్టెంట్లు పొరపాటున ఏ చిన్న తప్పు పని చేసిన కెమెరాల కంటికి దొరుకుతారనే సంగతి తెలిసిందే.

ఒక్క వాష్ రూమ్ లో తప్ప..
ఇక ఈ హౌస్ లోకి మొత్తం 60 కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటారు. కేవలం ఒక వాష్ రూమ్ లో తప్ప మిగిలిన అన్నిచోట్ల కెమెరాలను ఏర్పాటు చేసి ఉంటారు. ఇక బాత్ రూమ్ లాంజ్ లో కూడా కెమెరా ఉంటుంది. ఇలా ఏ మూలకు వెళ్లిన వారు కెమెరా కంటికి కనిపిస్తారు కనుక కంటెస్టెంట్లు ఎక్కడ కూడా స్వతంత్రంగా ఉండలేని పరిస్థితి హౌస్ లో ఉంటుందని చెప్పాలి.