ఈ వార్తను అనువదించండి:

తెలంగాణలో వర్షాలు: రాష్ట్రంలోని దాదాపు 11 జిల్లాల్లో రేపు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి ఆదేశించారు. రానున్న 24 గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్.పీ. లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లే నిర్ణయించుకోవాలన్నారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్ ను ఆదేశించారు.

పూర్తిగా చదవండి..