Bigg Boss 8: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్ 8 కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణా ముకుందా మురారి సీరియల్ నటి ప్రేరణ ఈ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే హౌస్ లోకి వెళ్లిన ఈమె ఎప్పటిలాగే తన తింగరి తనంతో అందరిని నవ్విస్తూ సందడి చేశారు.

ఇక ఈ సీజన్లో ఎన్నో ట్విస్టులు ఎన్నో ఊహించని షాకింగ్ న్యూస్ లు ఉంటాయని మొదటి నుంచి నాగార్జున చెబుతూ వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి కెప్టెన్సీ ఉండదని తద్వారా ఎవ్వరికి ఎలాంటి ఇమ్యూనిటీ ఉండదని మొదటి రోజే నాగార్జున అందరికి షాక్ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున నటి ప్రేరణ ప్రశ్నిస్తూ ఇప్పటివరకు మీరు ఎవరికీ చెప్పని ఒక సీక్రెట్ చెప్పాలని చెబుతాడు.

ఇలా సీక్రెట్ చెప్పమని చెప్పడంతో ప్రేరణ చిన్నప్పుడు నేను ఎవరికి తెలియకుండా వేరే వారి వస్తువులను తీసుకునే దానిని అని చెబుతుంది వెంటనే మరో కంటెస్టెంట్ నిఖిల్ దొంగతనం చేసేదానినని చెబుతోంది సర్ అంటాడు.ఇప్పుడు కూడా చేస్తున్నావా? అని నాగార్జున అడిగాడు. లేదు సార్. చెప్పాను కదా. అది చిన్నప్పుడు. అలా చేసేదాన్ని.. కానీ, ఇప్పుడు ఏదైనా తీసుకోవాలంటే వాళ్లను అడిగి మరి తీసుకుంటానని ప్రేరణ చెబుతుంది.

క్లెప్టోమేనియా…

ఇలా తీసుకోవడాన్ని ఏమంటారో తెలుసా అంటూ నాగార్జున ప్రశ్నించడంతో వెంటనే ప్రేరణ హా తెలుసు.. క్లెప్టోమేనియా అంటారని చెప్పడంతో దానిని ఏమంటారు కూడా నీకు తెలుసా అంటూ నాగార్జున నవ్వే సారు దీంతో నటి ప్రేరణ క్లెప్టోమేనియా అని వ్యాధితో బాధపడుతున్నారా అని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.