ఈ వార్తను అనువదించండి:

అక్టోబర్‌ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపాలనే లక్ష్యంతో విపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు మళ్లీ అధికారమే లక్ష్యంగా బీజేపీ కసరత్తులు చేస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)తో కలిసి పోటీచేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. కానీ ఆప్ ఈ ఎన్నికల్లో తమకు 20 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది.

పూర్తిగా చదవండి..