Rashmika: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. ఇలా ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టిన వారిలో బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారిలో సీరియల్ నటి ప్రేరణ ఒకరు.

ఈమె కన్నడ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ సీరియల్ తర్వాత పలు సీరియల్స్,అలాగే బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను ప్రేరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈసారి ఈ బ్యూటీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు.

ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన ఈమె తన అల్లరి పనులతో పెద్ద ఎత్తున కంటెస్టెంట్లను సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈమెకు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అంటూ నాగార్జున బిగ్ బాస్ వేదికపై ఈమెను ప్రశ్నించగా ఈమె ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

ఆడిషన్స్ కి కలిసి వెళ్లే వాళ్ళం..
తనకు ఇండస్ట్రీలో రష్మిక బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపారు. ఇండస్ట్రీలోకి రాకముందు మేమిద్దరం ఒకే గదిలో ఉండేవారమని ఆడిషన్స్ కోసం ఇద్దరం కలిసి వెళ్లే వాళ్ళం అంటూ సమాధానం చెప్పారు. అంతేకాకుండా అర్థరాత్రి స్కూటీపై సిటీలో చక్కర్లు కొట్టే వాళ్ళం అంటూ రష్మికతో తనకున్నటువంటి ఫ్రెండ్షిప్ గురించి ప్రేరణ చెప్పడంతో ఒక్కసారిగా రష్మిక ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఈమె రష్మికకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడంతో రష్మిక ఫ్యాన్స్ కూడా ఈమెకు సపోర్ట్ చేస్తారు అనడంలో సందేహం లేదు.