Sonia Akula: బిగ్ బాస్ 8 కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ 14 మందిలో ఒక నలుగురైదుగురు మినహా మిగిలిన వారందరూ కొత్తవారు కావడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి వారి బ్యాగ్రౌండ్ గురించి నేటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఈ విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఆదివారం హౌస్ లోకి అడుగుపెట్టిన వారిలో కంటెస్టెంట్ సోనియా ఆకుల ఒకరు. ఈమె తెలంగాణకు చెందిన అమ్మాయి. ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన ఈమె సోషల్ మీడియా వేదికగా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈమె బిగ్ బాస్ వేదికపై నాగార్జునతో మాట్లాడుతూ తాను కరాటే ఫైటర్ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ఇదివరకు పలు సినిమాలలో నటించిన సోనియా పెద్దగా చాలామందికి తెలియదు దీంతో ఈమె ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం అంటేనే రాంగోపాల్ వర్మ క్యాంప్ నుంచి ఎంతోమంది ఇప్పటికే కంటెస్టెంట్లు గా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ సోనియా ఆకుల సైతం వర్మ క్యాంప్ నుంచి వచ్చిన కంటెస్టెంట్ అని తెలుస్తుంది.

కరీంనగర్ బిడ్డ..
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతానికి చెందిన సోనియా నటిగా మాత్రమే కాకుండా మంచి సోషల్ మీడియా వర్కర్ గా పేరు పొందారు. ఈమె రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన కరోనా వైరస్, ఆశ ఎన్కౌంటర్ వంటి సినిమాలలో నటించారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమెను సోషల్ మీడియాలో అనుసరించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సోనియా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారని తెలుస్తోంది. మరి హౌస్ లో ఈమె తన ఆట తీరుతో ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.