ఈ వార్తను అనువదించండి:

Khammam: ఖమ్మంలో వరదల రాజకీయం హీటెక్కింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్ము మున్నేరు అతలాకుతలమవుతోంది. దీంతో ప్రభుత్వ అధికారులతోపాటు సీఎం రేవంత్ వరద బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులు బాధితులను పట్టించుకోకపోవడంపై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు.  దీంతో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్యనేతలు మున్నేరు వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్లదాడి జరిగింది. హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వరరావును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారి కార్లపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఓ బీఆర్ఎస్ కార్యకర్త కాలు విరిగినట్లు తెలుస్తుండగా.. ఈ దాడిలో నామా నాగేశ్వర రావు కారు పూర్తిగా ద్వంసమైంది.

పూర్తిగా చదవండి..