• సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు100వ జయంతి
  • ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్
  • PVR-Inox సహకారంతో దేశవ్యాప్తంగా ఫిల్మ్ ఫెస్టివల్స్

ఈ ఏడాది సెప్టెంబర్ 20న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు100వ జయంతిని పురస్కరించుకుని, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది. ఈ ఫెస్టివల్‌లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలతో పాటు వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా వంటి స్మాల్ సిటీస్ సహా 25 నగరాల్లో సెప్టెంబర్ 20 – 22, 2024 నుండి 10 రిస్టోర్డ్ ANR క్లాసిక్స్ ప్రదర్శించనున్నారు .ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో లెజెండ్ ANR క్లాసిక్ సినిమాలు ‘దేవదాసు’ (1953), ‘మిస్సమ్మ’ (1955) ‘మాయాబజార్’ (1957), ‘భార్య భర్తలు’ (1961), ‘గుండమ్మ కథ’ (1962), ‘డాక్టర్ చక్రవర్తి’ (1964), ‘సుడిగుండాలు’ (1968), ‘ప్రేమ్ నగర్’ (1971), ‘ప్రేమాభిషేకం’ (1981) ‘మనం’ (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం NFDC – నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా, PVR-Inox సహకారంతో దేశవ్యాప్తంగా ఈ ఫెస్టివల్స్ నిర్వహిస్తోంది.

Also Read: ViswamTeaser : విశ్వంతో శ్రీనువైట్ల విశ్వరూపం చూపిస్తాడు : గోపించంద్

ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్ మాట్లాడుతూ.. “అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్ రెట్రోస్పెక్టివ్‌ల భారీ విజయం తర్వాత, తెలుగు సినీ లెజెండ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఈ ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫెస్టివల్‌ను ప్రదర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంది. 1953 నుండి 2014 వరకు సినిమాల ఎంపికలో ANR బిగ్గెస్ట్ హిట్‌లు ఉన్నాయి, అవి యాక్టర్ గా ANR అద్భుతమైన ప్రదర్శన చూసే అవకాశాన్ని ప్రజలకు అందిస్తాయి . ఈ సినిమాలు దశాబ్దాలుగా ప్రజలతో ప్రతిధ్వని స్తున్నాయి. మన సినిమా వారసత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మేము అన్ని ప్రాంతాల నుండి భారతీయ సినిమా యొక్క విభిన్న వారసత్వాన్ని ప్రదర్శించడానికి కట్టుబడి ఉన్నాము . ఈ రెట్రోస్పెక్టివ్‌లలో మోడరన్ ప్రేక్షకులు క్లాసిక్ చిత్రాలను ఎంతగా ఇష్టపడుతున్నారో మేము చూశాము, అనేక స్క్రీనింగ్స్ హౌస్ ఫుల్ కావడం ఆనందంగా వుంది’ అన్నారు.