Samantha: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు బిజినెస్ రంగంలో దూసుకుపోతూనే మరోవైపు హీరోయిన్ గాను అలాగే నిర్మాతగా కూడా ఈమె కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సమంత చదువులో కూడా టాపరే అని తెలుస్తుంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో విషయాలు బయటకు తెలుస్తున్నాయి. ఈ క్రమంలోనే సమంత పదవ తరగతి మార్కుల జాబితా కూడా ప్రస్తుతం వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు సమంత సినిమాలలోనే కాదు చదువులో కూడా టాపరే.. నిజంగానే చదువుల తల్లి అంటూ ఈమె మార్కుల జాబితా పై కామెంట్లు చేస్తున్నారు.

మరి సమంతకు పదవ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి.. ఇవి ఎక్కడ చదివారు ఏంటి అనే విషయానికి వస్తే.. చెన్నైలోని పల్లవరంలో జన్మించిన సమంత తన విద్యభ్యాసం కూడా అక్కడే పూర్తి చేశారు.పల్లవరంలోని సెయింట్ స్టీఫెన్స్ మెట్రికలేషన్ పాఠశాలలోనే 10వ తరగతి వరకు చదివారు. ఇక పదవ తరగతిలో 1000 కిగాను ఈమె ఏకంగా 887 మార్కులను సాధించారు.

పదో తరగతిలో ఫస్ట్ ర్యాంక్..
ఇంగ్లీష్ మొదటి పేపర్‌లో 90 మార్కులు, రెండో పేపర్‌లో 74 మార్కులు సాధించగా, తమిళంలో మొదటి పేపర్‌లో 83 మార్కులు, రెండో పేపర్‌లో 88 మార్కులు సాధించారు. గణితంలో మొదటి పేపర్‌లో 100 మార్కులు, రెండో పేపర్‌లో 99 మార్కులు సాధించారు. అదేవిధంగా ఫిజిక్స్‌లో 95, బోటనీలో 84, హిస్టరీలో 91, జియోగ్రఫీలో 83 మార్కులు సాధించారు. ఇలా ఈ పరీక్షలలో మొదటి ర్యాంకు సాధించడంతో టీచర్లు కూడా ఈమెను పొగుడుతూ ఇందులో రాసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇలా సమంత పదవ తరగతి మార్కులు జాబితా బయటపడటంతో ఈమె టాలెంట్ చూసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.