Imanvi: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమా చేయడం కోసం ఎంతో మంది హీరోయిన్లు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అంతా కూడా ప్రభాస్ తో నటించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ ఈయన మాత్రం తన సినిమాలో కొత్త హీరోయిన్ కి ఛాన్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.

ప్రభాస్ ఇటీవల కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత తదుపరి ప్రాజెక్టులపై అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ప్రభాస్ మాత్రం వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా గడుపుతున్నారు.

ఈయన హను రాఘవపూడి డైరెక్షన్లో కొత్త సినిమాకు కమిట్ అయ్యారు ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఆగస్టు 17వ తేదీ ఘనంగా జరిగాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ఇమాన్వి ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ ఎవరు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇంతకుముందు ఏ సినిమాలలో నటించారు అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

ఇమాన్వి అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్.ఇమాన్వి ఢిల్లీకి చెందిన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్‌లో 1.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 913K లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె తరచూ సోషల్ మీడియాలో డాన్స్ రీల్స్ చేస్తూ ఎంతో మంది అభిమానులను కూడా ఆకట్టుకున్నారు.

సైనిక అధికారి కూతురి..
ఈమె ఇలియాస్ ఖురేషి దర్శకత్వం వహించిన ‘బీయింగ్ సారా’ షార్ట్ ఫిల్మ్ తో తన కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 2023లో ‘ఎనిమీ’లోని ‘తుమ్ తుమ్’ ఆల్బమ్ లో ఆమె డాన్స్ మూవ్స్ తో ఫుల్ పాపులరైంది. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే ఇమాన్వి పాకిస్తాన్ సైనిక అధికారి ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్ కుమార్తె. ఢిల్లీలో జన్మించిన ఇమాన్వి ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి కాలిఫోర్నియా వెళ్లి అక్కడే తన చదువులన్నిటిని పూర్తి చేశారు. ఇలా ఎంబీఏ పూర్తి కాగానే యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఏది ఏమైనా ఒక యూట్యూబర్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం అంటే నిజంగానే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి.