• శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారుల అదుపులో మలయాళ నటుడు వినాయకన్‌

  • ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ను కొట్టిన వినాయకన్‌

  • \మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై దాడి చేశాడని ఫిర్యాదు

  • వినాయకన్‌ను అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు అప్పగించిన సీఐఎస్ఎఫ్‌

  • రజనీకాంత్‌ జైలర్‌ సినిమాలో వర్మ పాత్రతో పాపులర్‌ అయిన వినాయకన్‌

Vinayakan Arrested in Samshabad Airport for Man Handling Security Officials: శంషాబాద్ ఎయిర్పోర్టులో జైలర్ సినిమా విలన్ వినాయకన్ ను పోలీసులు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్టులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ని వినాయకన్ కొట్టినట్టు తెలుస్తోంది. స్వతహాగా మళయాళ సినీ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేసిన వినాయకన్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా లో వర్మ పాత్రతో పాపులర్ అయ్యాడు. ఇక మద్యం మత్తులో ఉన్న వినాయకన్ కానిస్టేబుల్ పై దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది.

Baraabar premistha: దసరా బరిలో యాటిట్యూడ్ స్టార్
దీంతో వినాయకన్ ను అదుపులోకి తీసుకొని ఆర్.జి.ఐ పోలీసులకు సీఐఎస్ఎఫ్ అప్పగించినట్టు తెలుస్తోంది. మరోపక్క మద్యం మత్తులో ఉండి తమపై దాడి చేశారని అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఇక గత ఏడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తనతో వినాయకన్ అరెస్ట్ అయ్యాడు. ఇక కొచ్చిన్ లో సినిమా షూటింగ్ ముగించుకుని గోవా కనెక్టింగ్ ఫ్లైట్ కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వెయిటింగ్ లో ఉన్న సమయంలో వినాయకన్ దాడి చేసినట్టు చెబుతున్నారు. ఇక వినాయకన్ ప్రస్తుతానికి గోవాలో సెటిల్ అయినట్టు తెలుస్తోంది. ఇక వినాయకన్ ను అదుపులోకి తీసుకుని ఆర్జిఐ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.