Translate this News:

Skin Care Products: పిల్లల చర్మం బావుండాలని వాళ్ళు పుట్టిన దగ్గర నుంచే మనం ఎన్నో రకాల ఉత్పత్తులను వాడుతుంటాం. మాయిశ్చరైజర్లు, ఆయిల్స్, సన్‌స్క్రీన్ లోషన్లు, ఆయింట్ మెంట్‌లు…ఇలా చాలా పూసేస్తుంటాం. వీటితో వాళ్ళ చర్మం బానే ఉంటుంది కానీ హార్మోన్ల అసమతుల్యతే దెబ్బ తింటుంది అని చెబుతున్నారు రీసెర్చర్లు. లోషన్లు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ కండిషనర్లు, ఆయింట్‌మెంట్లు, సన్‌స్క్రీన్‌లు వీటన్నింట వల్లనా పిల్లల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. పిల్లల్లో ఎండో క్రైన్‌కు అంతరాయం కలిగించే రసాయనాలు వీటిల్లో కనిపట్టారు జార్జ్ మాసన్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ పబ్క్ హెల్త్ పరిశోధకులు. ఈ లోషన్లు, ఆయిల్స్ మన్నిక, వాటి గుణాలను మెరుగుపర్చడానికి ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు. దీన్నే థాలేట్ అంటారు. ఇవి చాలా వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులో కనిపిస్తాయి. దీన వల్లనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు పరిశోధకులు. ఈ రసాయనాలు శరీరంలోని సహజ హార్మోన్లను నిరోధించడం లేదా సంకర్షణ అయ్యేలా చెయ్యడం లాంటివి చేస్తున్నాయి. దీని వలన వృద్ధి దశలో ఉండే పిల్లలై అసాధారణ ప్రభావం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరిశోధకుడు, డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ మైఖేల్ ఎస్ బ్లూమ్. అయితే ఈ పరిశోధన ఇంకా మొదటి స్థాయిలోనే ఉందని…దీని మీద మరింత రీసెర్చ్ చేయాల్సి ఉందని చెబుతున్నారు. 

పూర్తిగా చదవండి..