సీఎం కేజ్రీవాల్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇటీవల వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 10న తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది. సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే లిక్కర్ పాలసీ ఈడీ కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా సీబీఐ కేసులో ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేయగా.. జైలులోనే జూన్‌ 6న సీబీఐ
అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంది.

ఇద్దరు నేతలకు బెయిల్…

దేశ రాజయాకియల్లో గత ఏడాది నుంచి ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్య నాయకులు జైలు పాలయ్యారు. అందులో ముఖ్యంగా సీఎం పదవిలో ఉన్న కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అలాగే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈ కేసులో అరెస్ట్ చేసింది. ఇటీవల మనీష్ సిసోడియాతో పాటు కవితకు కూడా సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 5 నెలల తరువాత కవితకు, గతేడాది ఫిబ్రవరి 26న అరెస్టైన మనీష్ సిసోడియాకు దాదాపు 17 నెలల తరువాత బెయిల్ లభించింది.

ఢిల్లీ ఎన్నికలే?…

మరి కొన్ని నెలల్లో ఢిల్లీలో దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజధాని పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీతో కాంగ్రెస్, ఆప్ పార్టీలు కార్యాచరణ ప్రారంభించాయి. ఎలాగైనా ఢిల్లీలో ఈసారి కాషాయ జెండా ఎగరవేయాలి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. కాగా ఢిల్లీ ఎన్నికల వరకు కేజ్రీవాల్ ను జైల్లోనే ఉంచాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు ఢిల్లీలోని గల్లీల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కేజ్రీవాల్ జైలులోనే ఉంటే సెంటిమెంట్ తో మరోసారి ఢిల్లీ పీఠాన్ని ఆప్ దక్కించుకుంటుందనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. మరి కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

The post CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కేనా? appeared first on Rtvlive.com.