పవన్ కళ్యాణ్: సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ తో సమావేశం అయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్‌ను అందజేశారు పవన్. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ ను పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.

వార్తలు అప్‌డేట్ చేయబడుతున్నాయి…

The post BREAKING: సీఎం రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ appeared first on Rtvlive.com.