Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కార్యక్రమం ప్రారంభమై మొదటి వారం పూర్తి చేసుకుని హౌస్ నుంచి బెజవాడ బేబక్క బయటకు వచ్చేసారు. ఇక రెండవ వారంలో భాగంగా నామినేషన్స్ కూడా చాలా వాడి వేడిగా కొనసాగాయి. ఇక రెండవ వారం నామినేషన్స్ లో భాగంగా విష్ణు ప్రియ, నాగ మణికంఠ,పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక, కిరాక్ సీత, నిఖిల్ ఉన్నారు.

ఇక ఈ నామినేషన్స్ లో భాగంగా విష్ణు ప్రియ సోనియా ఆకుల ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. అయితే రెండవ వారం హౌస్ లో భాగంగా సోనియా ఆకుల విష్ణు ప్రియ పట్ల చేసిన కామెంట్స్ విష్ణుప్రియకు చాలా ప్లస్ అయ్యాయని చెప్పాలి.విష్ణు ప్రియను ఉద్దేశిస్తూ… అడల్ట్స్ జోక్స్ వేస్తావు. సరిగ్గా బట్టలు ధరించడం రాదు. నీ మైండ్ లో అడల్ట్ కంటెంట్ రన్ అవుతూ ఉంటుందని సోనియా ఆకుల విష్ణు ప్రియ పై రెచ్చిపోయారు.

నువ్వు హౌస్ లో ఎలా ఉన్నావ్? నీ ఫ్యామిలీ చూడరేమో కానీ నాకు ఫ్యామిలీ ఉంది అంటూ పరోక్షంగా తనకు ఎవరూ లేరని తన వ్యక్తిగత విషయాల పట్ల కూడా విమర్శలు చేయడంతో ప్రేక్షకులలో సోనియా ఆకుల పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరిగింది. అయితే ఈమె చేసిన ఈ కామెంట్స్ విష్ణు ప్రియ పట్ల సింపతిని పెంచడమే కాకుండా తన పట్ల ప్రేక్షకులలో కాస్త పాజిటివీటిని కూడా పెంచింది.

విష్ణు ప్రియకు పెరిగిన మద్దతు…
ఇక విష్ణు ప్రియ విషయంలో సోనియా ఆకుల చేసిన కామెంట్స్ పట్ల నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలోనే గతంలో పల్లవి ప్రశాంత్ విషయంలో అమర్, రతికా చేసిన విధంగానే సోనియా ఆకుల కూడా వ్యవహరిస్తున్నారు. అయితే వీరు చేసిన నెగిటివ్ కామెంట్లు గతంలో పల్లవి ప్రశాంత్ కు అనుకూలంగా మారాయి. ఇప్పుడు విష్ణు ప్రియకు కూడా అనుకూలంగా మారడంతో ఈమె సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు అంతేకాకుండా ఈమెకు మంచి ఫాలోయింగ్ కూడా పెరిగిందని చెప్పాలి.