ఈ వార్తను అనువదించండి:

అనర్హత ఎమ్మెల్యేల విషయంలో 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. దీంతో కాంగ్రెస్, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే.. బీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చేలా రేవంత్ వ్యూహం ఉంటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతంలో రెండు సార్లు కాంగ్రెస్ శాసనసభ పక్షాలను విలీనం చేసుకుని భారీ దెబ్బకొట్టింది బీఆర్ఎస్. దీంతో రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్ కోలుకోదన్న చర్చ కూడా తీసుకువచ్చింది. ఇందుకు కారణమైన బీఆర్ఎస్ పై రేవంత్ పగ తీర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారన్న చర్చ సాగుతోంది.

పూర్తిగా చదవండి..