సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్‌లకు ఉపాధి కల్పించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్‌పై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ స్ట్రీమ్‌లైన్‌ అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్‌ స్ట్రీమ్‌లైన్ చేయడంలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్స్‌గా వినియోగించుకోవాలని సూచనలు చేశారు. హోమ్‌గార్డ్స్‌ తరహాలోనే ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని తెలిపారు. ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని అధికారులకు ఆదేశించారు.

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. పోర్ట్‌ బ్లెయిర్‌ పేరు మార్పు

ఇదిలాఉండగా.. ట్రాన్స్‌జెండర్లలో చాలామంది రైల్వే స్టేషన్‌లలో, గుడిలో డబ్బులు అడుగుతుంటారు. అలాగే కిరణా దుకాణాల్లతో పాటు ఇతర షాపుల్లో కూడా డబ్బులు ఇవ్వాలని ఓనర్లను అడుగుతుంటారు. కొందరు ట్రాన్స్‌జెండర్లు డబ్బులు ఇచ్చేవరకు కూడా అక్కడి నుంచి కదలరు. మరోవైపు తమకు ఎవరూ ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదని కూడా వారు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ తీసుకున్న నిర్ణయం వల్ల కొంతమందికైనా ఈ విధంగా ప్రయోజనం ఉంటుందని నెటీజన్లు భావిస్తున్నారు.

The post Telangana: ట్రాన్స్‌జెండర్లకు సీఎం రేవంత్ బంఫర్ ఆఫర్.. appeared first on Rtvlive.com.