• సెప్టెంబర్‌ 27న పార్ట్ 1 రిలీజ్
  • బియాండ్‌ ఫెస్ట్‌లో దేవర
  • 25న అమెరికాకు టైగర్

Devara in Beyond Fest 2024: జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 27న పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. దేవర కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. హాలీవుడ్‌లో జరగనున్న అతిపెద్ద ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో దేవరను ప్రదర్శించనున్నారు.

కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెలిస్‌లో అతిపెద్ద జానర్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ‘బియాండ్‌ ఫెస్ట్‌’ 2024 జరగనుంది. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 9 వరకు ఈ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది. సెప్టెంబర్‌ 26 సాయంత్రం ఈజిప్టియన్‌ థియేటర్‌లో దేవర సినిమాను ప్రదర్శించనున్నారు. హాలీవుడ్‌ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా దేవరను వీక్షించనున్నారు. దీనికోసం జూనియర్ ఎన్టీఆర్‌ సెప్టెంబర్‌ 25న అమెరికా వెళ్లనున్నారని తెలుస్తోంది.

Also Read: Ram Charan: ఏపీ సీఎం చంద్రబాబును రామ్‌ చరణ్ కలవడం లేదు!

దేవర సినిమా ప్రీసేల్‌ బుకింగ్స్‌లోనే రికార్డులు సొంతం చేసుకుంది. నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా నిలిచింది. ట్రైలర్‌ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.