ఈ వార్తను అనువదించండి:

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఏళ్ల క్రితం ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వాళ్ల జోలికి ప్రస్తుతం తాము వెళ్లడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. చెరువులు, కుంటలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేసి వ్యాపారాలు చేస్తున్న వారే ప్రస్తుతం తమ టార్గెట్ అని అన్నారు. ఈ రోజు RTV అన్‌సెన్సార్డ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. న్యాయవాదులు, జర్నలిస్టులు, వివిధ వర్గాల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. హైడ్రా కార్యకలాపాలపై వ్యక్తం అవుతున్న సందేహాలను RTV వేదికగా ఆయన నివృత్తి చేశారు. హైడ్రాకు చట్టబద్ధత లేదంటూ వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. హైడ్రా జీవో ద్వారా ఏర్పాటైందన్నారు. గతంలో ప్లానింగ్ కమిషన్, ఏసీబీ లాంటి సంస్థలు సైతం జీవో ద్వారానే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు.

పూర్తిగా చదవండి..