ఈ వార్తను అనువదించండి:

AP వార్తలు: ఏపీలో కొత్త మద్యం పాలసీపై తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 18న జరిగే మంత్రివర్గ భేటీలో నూతన లిక్కర్ విధానానికి ఆమోదం తెలపనుంది. మంత్రి వర్గ ఉపసంఘం తమ సిఫార్సులను కేబినెట్ కు సమర్పించనుంది. మద్యం దుకాణాలు..బార్లను గతంలో లాగానే ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు 19న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పాలసీపై కసరత్తు ఏపీలో అధికారంలోకి వస్తే పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావటంతో పాటుగా తక్కువ ధరలకే మద్యం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో కొత్త మద్యం పాలసీ పైన కసరత్తు చేస్తోంది .ఇందు కోసం నియమించిన కమిటీ ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను పరిశీలించింది. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీఅ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ఈ నెల 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

పూర్తిగా చదవండి..